పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యాకాంక్షితసుపూర్తి యాచరించుచును శా
                   ఖాచంక్రమక్రియఁ గడపఁజనక
ప్రకృతార్థభావంబు పాదుకో నదుకుచు
                   నుపవర్తి యెందు నత్యూర్జితముగ


గీ.

నొకటఁ బూర్వోత్తరవిరోధ మొందకుండఁ
దత్తదవయవవాక్యతాత్పర్యభేద
ములు మహావాక్యతాత్పర్యమునకు నొనరఁ
బలుక నేర్చుట బహుతపఃఫలము గాదె?”

(ప్రభావతీప్రద్యుమ్నము)

సీ.

"పొసఁగ ముత్తెపుసరుల్ పోహళించినలీలఁ
                   దమలోన దొరయుశబ్దములఁ గూర్చి
యర్థంబు వాచ్యలక్ష్యవ్యంగ్యభేదంబు
                   లెఱిఁగి నిర్దోషత నెసఁగఁ జేసి
రసభావములకు నర్హంబు వైదర్భి
                   మొద లైనరీతు లిమ్ముగ నమర్చి
రీతుల కుచితంబు లైతనరారెడు
                   ప్రాసంబు లింపుగాఁ బాదుకొల్పి


గీ.

యమర నుపమాదులును యమకాదులు నగు
నట్టియర్థశబ్దాలక్రియలు ఘటించి
కవితఁ జెప్పఁగ నేర్చుసత్కవివరునకు
వాంఛితార్థంబు లొసఁగనివారు గలరె?”


లయవిభాతి.

“చలువ గల వెన్నెలలచెలువునకు సౌరభము
గలిగినను సౌరభము చలువయుఁ దలిర్పం