పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

125

తృతీయా శ్వాసము


సీ. అని పల్కి మణికంధరునిదిక్కు నందు దృ
         ష్టి నిగిడ్చి యొక్కింత చెవియు నొగ్గి
యొక కేల మాటలాడకయుండఁ గలభాషి ,
         ణికి సంజ్ఞ సేయుచు నిశ్చలత్వ
మున నొకించుక సేపు విని యౌర వారకా
         మినుల మేలిట్టిదె యనుచు నగిన
నది యేమి యెఱిఁగింపు మని యాలతాంగి త
        న్ననయంబు నడుగ నిట్లనియె నతఁడు

గీ. నీకు నేమని చెప్పుదు నీరజాక్షి
   యడఁచుకొనియెద ననిన నవ్వడఁపరాదు
   పరమసంయమిఁ దా నట్లు పరము చెఱచి
   మిగులఁ దుది రంభ చేసినతగవు వినుము.51

క. కళలంటి కరఁచి తనచె
   య్వులఁ జొక్కెడుతపసిమది చివుక్కురు మనఁగా
   నలకూబర విడు విడురా
   యలసితి నని పల్కె మన్మధాతివివశతన్ .52

మ. అని చెప్ప న్విని సిద్ధుఁ జూచి నగనేలా యింతభవ్యాత్మయా
   వనజాతేక్షణ యేమిసేయును మహావాల్లభ్యసౌభాగ్యవ
   ర్తన నర్థేశుకుమారుఁ డంతరహిగాఁదన్నేలుకోఁబోలు నా
   యన దానిత్తఱి నట్టివల్లభకు దవ్వై యెందునున్నాఁడొకో.