పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

126

కళాపూర్ణోదయము


వ. అతనిఁ బరికించి చూడవలయు ననుటయు సిద్ధుఁడు నవ్వుచు నీ కిదియే కదా ప్రధాన ప్రయోజనంబునని పల్కి యిటునటు పరికించి చూచి యతఁడున్న చోటు గని కలభాషిణికిట్లనియె.

ఉ. తా వెనువెంటఁ బాయక సదా చరియించినఁదద్వినోదమో
    దావృతిఁ జిక్కి రంభ తగినట్టితపోహతి సల్పలేదు కో
    పావహ మింద్రుబుద్ధి కదియట్లగుటంబ్రియఁగూడి యట్టి కా
    ర్యావసరంబులందుఁ జనఁడాతఁడు మానఁడు పెన్విరాళిచేన్ .

క. కావున మణికంధరునిత
   పోవనము సమీపభాగమున నొకవనచూ
   తావళిలో నున్నాఁ డదె
   పూవులను జిగుళ్ల నొప్పుభూజము క్రిందన్ . 56

వ. అని చెప్పి యిట్లనియె.57

క. తరుణీ యిపుడాతనిపై
   బరాకు చే నీవు గానపాటవగుణముం
   గరము మెఱయింపలే వే
   నరిగెద మఱి లేద యితర మగుపని యిచటన్ 58

గీ. అంపితేఁ బోయి వచ్చెద ననుటయుఁ గల
   భాషిణి మహాత్మ నిన్ను నా పాలిభాగ్య