పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లోఁ జేరి రాజిల్లునవియ. ఇట్లు పేర్కొనఁబడినగ్రంథద్వయమునకుఁ గర్త సూరనార్యకవివరేణ్యుఁడు. ఇతఁ డత్యుత్తమకవివతంసులలోనివాఁ డని మఱి వేఱె వక్కాణింప నక్కఱ లేదు.

ఉ.

“ఎంగిలిత్రోవలం బడక యెప్పటికప్డు నవీనకల్పనల్
సంగతముం బొనర్చి సరసప్రకృతిం గృతిఁ గూర్చునట్టి నీ
రంగులు రక్తు లెవ్వరికి రావుగదయ్య తలంచిచూడ నో
పింగళిసూరనార్యసుకవీ! శుకవిభ్రమకృల్లసద్గవీ!”

అనెడి యోలేటి వేంకటరామశాస్త్రి విద్వత్కవిసత్తమునివాక్కులు నిక్కువములు. ఈపింగళి సూరనార్యుఁడు మహాకవివర్యుఁడు. కళంకరహిత మైనకవితాకళాకౌశలవైశాల్యము గలిగి విలసిల్లువాఁడు. అత్యద్భుతప్రతిభాశాలి. విశ్వకవి. మృతిరహితుఁ డైనరచయిత. ఆచంద్రార్క మీతనికావ్యములు ప్రకాశించుఁగాక! ఇతఁ డాంధ్రకవీంద్రులందఱలో నగ్రగణ్యులలో నొకఁడు. ఇంతియ కాదు. హిందూదేశమందలి యితరమండలములందే కాక ప్రపంచమునందు సర్వదేశముల, సర్వభాషల, సర్వకాలములయందు, వెలసినకవిశిరోమణిశ్రేణిలోనివాఁడు. ఈతనిమించిన కవిని విశ్వమునం దెందును గానము. ఇతఁడు బహుగ్రంథరచనాధురంధరుఁడు. నిర్దుష్టకవితాదక్షుఁ డైనమహాలాక్షణికుఁడు. వింతవింతతో)వలు తొక్కిన తేజశ్శాలి. తన ప్రభావతీప్రద్యుమ్నమునఁ దా నిటులు చెప్పుకొనియె.

మ.

“జనము ల్మెచ్చఁగ ము న్రచించితి నుదంచద్వైఖరిం గారుడం
బును శ్రీరాఘవపాండవీయముఁ గళాపూర్ణోదయంబు న్మఱిం