పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పింగళి సూరన

శ్రీమదాంధ్రసారస్వత మమృతతుల్యము. ఈ భాష విశేషశ్రవణీయ మై సర్వాంగసుందర మై ప్రస్తుతికిఁ బాత్ర మగుచుఁ బ్రకాశించుచుండును. సంస్కృతకవి యైనసుధాకరుఁ డాంధ్రభాషాసుధామాధుర్యము నిట్లు మిక్కిలి యెక్కువగఁ గొనియాడినాఁడు.

శ్లో.

"యోవేత్త్యాంధ్రమయీం వాణీం
శిరీషసుమపేశలామ్
కిం తస్య సుధయా కార్యం
మాధుర్యరసనిర్ణయే!”

మన తెలుఁగు ప్రాగ్దేశభాషలం దెల్ల నెక్కుడు శ్రావ్యమైన దని ప్రాక్పశ్చిమఖండవాసులచేఁ బొగడఁబడినది. ఐరోపాదేశీయుఁ డైన 'బిషప్ కాల్డువెల్' అనుదొర మనదక్షిణహిందూదేశమునకు వచ్చి యిచటిదేశభాషల నెల్ల మిగుల బాగుగ నేర్చికొని భాషాతత్త్వవేత్తలలో నగ్రగణ్యుఁడు గ నెంచంబడినవాఁ డాంధ్రము దేశభాషలలో నెల్ల విశేషశ్రావ్య మైనదని శ్లాఘించెను. తెలుంగుబాస సంగీతమున కెంతయుఁ దగియున్నది. గాయకు లాంధ్రులు కాని యనాంధ్రులు కాని యర్థము తెలిసినను, తెలియకున్నను, తెలుఁగుపాట లనేకములు పాడుదురు. ఇట్టియత్యధికమాధుర్యగరిమ గలమనయాంధ్రభాషయొక్కయౌన్నత్యము పురాతనాంధ్రకవిప్రవరులచే స్తుతింపఁ