పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

లును లో కానంద సంధాన కార్యపరాయణు లై తేజరిల్లుదురు గావుత,

నే నీ నూతన ప్రతిని సమకూర్చుటలో వావిళ్ల వారియచ్చు కూటమునను సరస్వతీ ముద్రణాలయమునను బ్రకటితము లైన కళాపూష్ణోదయమ"లఁ బ్రమాణముగాఁ దీసికొంటిని. వీస్యం దుఁ జూపట్టని పాఠముల మీఁదఁ బేర్కొ నఁబడిన గ్రంధముల నుండి చేకొంటిని. మఱియుఁ క్లిష్ట ఘట్టములకు మూలసంఖ్యల నిచ్చి “వెన్నెల” అను పేరుతో లఘువ్యాఖ్యను, కఠినపదముల కకారాదిక్రమముగ ను వివరణమును, కొత్తఁగాఁ జేర్చిన పాత ముల నేయే ప్రతులనుండియు నేయేగ్రంధములనుండియుఁ దీసి కొంటినో తెలుపుటకై పద్య సంఖ్యలతో నాయా పాఠములను వానిమాతృకానామములను గ్రంధాంతమునఁ బ్రకటించితిని.

ఈనూత్న పాఠ సంగ్రహోద్యమమున నాకు బాసట మే నపండితమండలికి గౌరవపూర్వకముగా ధన్యనాదముల సంద జేయుచున్నాఁడను. మఱియు లఘున్యాఖ్యను వ్రాయుటలో బ్రహ్మశ్రీ ప్రయాగ వేంకట రామశాస్త్రి గారు చేసిససాహా య్యము ప్రశంసార్హము.

నేను సర్వజ్ఞుఁడను గాకుండుట చే ని దేవియేని ప్రమా దము లుండనోపు. వానిని సహృదయు లగు పాఠకసోదరులు పాటింప కుందురుగాక.

ఓం తత్సత్.

విబుధ విధేయుఁడు, కాశీభట్ట సుబ్బయ్య శాస్త్రీ,