పుట:కపాలకుణ్డలా.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2

దెవరు నా వేలులు వ్రాయ నేర్చినను వీరిపద్దతి ననుకరింపనిదిగ నుండునేని యవియన్నియు రసవిహీనముగ నుండుననియే మా యభిప్రాయము. ఈ కపాలకుండలయొక్క ఉత్కృష్ట కల్పన కచ్చెరు వొంది లండన్ నగరమునందు హెచ్. డి. ఫిలిప్స్ (H. D. Pilips) అను వారిచే ఆంగ్లేయ భాషయందును; లీప్ జిగ్ పట్టణమందు సి. క్లైం(C. Klemm) అనువారిచే జర్మన్ భాషయందును పరివర్తనము చేయఁబడియెను. ఇది హిందూస్థాన దేశ భాషలయందును పరివర్తనము చేయఁబడి యున్నది. నేను ఈ పరివర్తనమును మైసూరులోనుండు పెన్షన్డ్ మేజస్ట్రీట్ శ్రీమాన్ - బి. వేంకటాచార్యులు బి. ఏ. గారి కర్నాటక భాషయొక్క ఆధారముచే నాంధ్రీకరించితిని. పాఠకుల ఆదరాతిశయము ననుసరించి యింకను నిట్టి నావెలులను రచియింపఁ దలంపుగొని యున్నాఁడను.

ఇట్లు

సి. దొ ర సా మ య్య 

.


విద్యావతి ఆఫీసు చెన్నపురి: 1908.