Jump to content

పుట:కపాలకుణ్డలా.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉపోద్ఘాతము


"కపాలకుండల" అను పేరుగల నీయుపన్యాస గ్రంథకర్తలైన శ్రీబంకించంద్రచట్టోపాధ్యాయులవారు రచనా కౌశలము నందెంతటి ప్రజ్ఞావంతులను నది నాయితర పరివర్తన గ్రంథములవలనఁ దెలిసియుండును కదా ? బంగాళదేశమందు ఈ బంకించంద్రచట్టోపాధ్యాయుల వారు అద్వితీయ కల్పనాశక్తి గల వారని ప్రసిద్ధి నొందినదేగాక, ఇతర దేశ భాషలందు వీరి గ్రంథములు పరివర్తనమగుట కారంభించినది మొదలు సకల దేశములందును ప్రసిద్ధినొందిరి. ఆంగ్లేయ దేశమందెట్లు షేక్స్పి యర్ నవీనకథలు నిర్మించుటయం దద్వితీయులని కీర్తివడసిరో యట్లు హిందూ దేశమునందు శ్రీబంకించంద్రచట్టోపాధ్యాయులు నవీనకథలు నిర్మించుటయందు అద్వితీయులని కీర్తిగాంచిరి. మఱియు భావగర్భిత పద ప్రయోజనమునందు కాళిదాసుతోను యుక్తియందు బాణభట్ట దండి కవులతోడను సమానశక్తి కలవారు. వీరి బంగాళీ నావెలులు ఇతర దేశ భాషలయం దిపు డిపుడు పరివర్తన మగుచున్నవి. సామాన్యబుద్ది గలవారిచే నిర్మించు నా వెలులు రసభంగముగను, కథాచమత్కృతి నీచముగను నుండును. ఈ ప్రజ్ఞావంతుఁడు రచియించు నా వెలులు వారి మహా మేధ ననుసరించి మిగుల గంభీరభావమును రసమును ఔచిత్యమును బోధ చేయుచుండును. దేశభాషలం