________________
క పాల కు ం డ లా కూలము, ఉపకూలము, ఏదిక్కునందును కనఁబడ లేదు. నావికులకు దిగ మ కలిగెనని తోఁచెను, ఓడ యెదిక్కు నందు పోవుచుండెనో తెలియ లేదు. ఓడ కూలమును జేరక సమివ సముద్రమును జేరిపోవునేమో యని నావికులుభయ పడుచుండిరి. మంచు, లోపల పడనీయక ఓడకు మూఁత వేసి యుండినం దున లోపలనున్న ప్రయాణికుల కేదియు తెలియ కుం డెను. అయినను యువకుఁడు బై టవచ్చి చూచి, య ప్లే లోపలికినిఁ బోయి చూచివచ్చి ముసలివానితోఁ జెప్పెను. అంత ఓడయందు మహాకోలాహలమునకు ప్రారంభమైనది. ఓడయందు శయ నించియుండిన స్త్రీలు మేల్కొని విన్న తోడనే ఆర్తనాదము చేయంగొడంగిరి. వృద్ధుఁడు గట్టు చేర్చు, గట్టు చేర్చు, అనెను. యువకుఁడు కొంచెమునవ్వి, గట్టెక్కడనున్న ది ? అది తెలిసియుండెనేని యింతటి విపత్తునకు కారణమే లేదు, అనెను. దీనిని విని, నౌకారోహకులు మిగుల రోదనము చేయు చుండిరి, యువకుఁడు వారిని సమాధానపఱచి, ఓడ నడుపు వారినింజూచి, భయము పడవలసినది లేదు, వెన్నెల మాయు చున్నవి, ఇంక రెండు మూఁడు గడియలలో తెల్లవాజును. అంతలో ఓడ యెచ్చటికిని పోదు, తెరచాపలు విప్పి వేయుఁడు, ప్రవాహము పోవుమార్ధముగ ఓడను విడిచి పెట్టుడు, అనెను. నావికులు ఈ పరామర్శ సరియైనదని ఆ ప్లే చేసిరి. కొంత సేపు ఓడను అది పోయిన రీతిగా విడిచి పెట్టిరి. ప్రయాణికులు భయముతో కంఠగతప్రాణులై రి. గాలి లేనం