Jump to content

పుట:కపాలకుణ్డలా.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

ప్రథ మ ప రి చ్ఛే ద ము . దున తరంగాందోళనము చేఁ గల్గు కంపము లేకుండిరి. శ్రీలం దజును గొంతెత్తి వివిధశబ్ద విన్యాసముతో నేడ్చుటకు ప్రారంభించిరి. గంగాసాగరమునందు బిడ్డను విసర్జనము చేయ వచ్చియుండిన యొక స్త్రీ బిడ్డను విసర్జించి, మజుల నీటి నుండి యెత్తుటకు చేతఁగాకుండినది, ఆఒక్కతే మాత్రము ఏడువకుం డెను. ఇట్లు పోవుచుండఁగా ఉదయమై ఝాము సే పై నట్లు తోఁ చెను. అపుడు నావికులు ఉన్నట్లుండి సముద్రము యొక్క పంచపీర్ల • కీర్తనము చేసిరి. ప్రయాణికులు వీర్ల నామకీర్త నమును విని, ఏమి ! ఏమి ! క మాయి ! ఏమైనది ! అని యందజు నొక్కమాటే యడుగఁ దొడంగిరి. మాఝలందఱు నేక కంఠ ముతో సూర్యోదయము ! సూర్యోదయము ! భూమి కనం బడెను ? భూమి కనఁబడెను ! అని యజచిరి. యాత్రాక్టు లందఱును ఔత్సుక్యముతో ఎచ్చటనున్నాము ! ఏమిసంగతి ! తెలిసికొనుదమని చెప్పుచు ఓడ అంచునకువచ్చి చూచుచు నిల్చిరి. చూడఁగా సూర్యుఁడు ప్రకాశమానుఁడై యుండెను. దిజ్మండలము చండమారుతము చే ముక్తమై కనఁబడు చుండెను. అపుడే ప్రొద్దెక్కి యుండెను. ఓడ వచ్చి యున్న స్థలము మహా సముద్రముగ నుండ లేదు. నదీముఖమై యుండెను. అయినను

  • పీర్, అనఁగా ముసల్మానులలో మహాత్ములకు పేరు. తురకలలో ఓడ నడుపువారు, పొరి మతానుసారముగా సముద్రమునందు ఐదుగురు మహాత్ములు స్నోరనియును, కష్టమువచ్చినపుడు వారిని స్మరించిన మేలగు ననియును భావించెదరు. $ మాయి, అనఁగా తురకభాషలో ఓడనడు పువానికి పేరు.