పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాజశేఖర చరిత్రము

డారాయి యూడి నీళ్ళలోఁబడి గొప్పధ్వనిని జేయుచు వచ్చెను గాని పళ్లెములో నడుగునఁ ఋవ్వులుండుటచేత నిత్తడిపళ్లెముమీఁద వాయించిన ట్టెంతమాత్రము వినఁబడినదికాదు. ఆగుడ్డయంతయుమండిపోయినతరువాత ఆతడు లోపలికిఁ బోయి మసి మొదలగువానినిపూర్ణముగా నెత్తుకొని వెడలిపోయెను.

    రాజశేఖరుఁడుగారు నువర్ణ వద్యను గ్రహింపవలెనను నపేక్షతో నిత్యమును బై రాగికి  సమస్తొపచారములను జరిపించుచు, ఆతని సమయము కనిపెట్టి యనుసరించుచు, అతఁ డొకనాడు గంజాయిత్రాగి యుల్లాసముగాఁ గూరుచున్నప్పుడుచేరబోయి వనయముతో "బావాజీ !లోకములో సువర్ణముచేయువిద్య యున్నదా?" అని యదిగెను. ఆతడు మందహాసము చేసి "ఉన్నది" అని చెప్పెను. ఆపయిన మాటలధోరణిని 'ఆవద్యయొక్కసంగతి యెటువంటిద 'ని రాజశేఖరఁడు  మహాభక్తిశ్రద్ధలతో చేతులు జోడించుకొని  యడిగిరి. అందుమీఁద నతఁడు 'ఆసంగతిపరమరహస్య మయినను నీకుఁజెపెద 'నని పూర్వ యుగములో స్పర్శ వేదివలన నినుము బంగార మగుచు వచ్చెనుగాని యీకలియుగములో స్పర్శవేది లేదనియు, పూర్వము శంకరాచార్యు లవా రొక యీఁ డిగవానికి సువర్ణముఖి యను విద్య నుపదేశింపఁగా వాఁడు చరకాలము బంగారమును జేసి కడపట యోగులలోఁ గలసి వారి కుపదేశించి దేహము చాలించె ననియు, తనగురు వావద్యను తనకుపదేశించెను గాని మంత్రముయొక్క పునశ్చరణము పూర్తికానందునఁ దనకది యింకను ఫలింపలే దనియు,   తానిప్పుడు పసరులతోమాత్రమే బంగారమును జేయగల ననియు, రాజశేఖరఁడుగారిమీఁది  యనుగ్రహముచేతనే చెప్పినట్లుచెప్పి, ఎల్ల వారును దన్ను బంగారము చేయుమని బాధింతురు