పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రుక్మిణిమెడకు గట్టి యదియున్నంతకాలము నేవిధమయిన గాలియు సోకదనిచెప్పెను. కొమార్తెయొక్క గ్రహబాధ నివారణచేసినందునకయి రాజశేఖరుడుగారు శాస్త్రులకు దోవతులచాపు కట్టబెట్టుటయే కాక నూటపదియాఱురూపాయలను బహుమాన మిచ్చిరి. శాస్త్రులారాత్రి అమ్మవారి పెట్టెను దెచ్చినప్పు డందులో వేసి కొన్ని బొమ్మరాళ్ళను మాత్రము తెచ్చుకొనెను. ఆవలి కందఱను బంపివేసి తా నొక్కడును లోపల గూరుచున్నప్పుడు తలుపువేసుకొని గదియొక్క మట్టిమిద్దెకు నడుగామ మేకులను దిగగొట్టి యామేకులకు జనుపనారత్రాడును గట్టి, కొత్తబట్టలో గొంతముక్కను జించి వానికి గొంచెము కొంచెము దూరముగా బొమ్మరాళ్ళను ముడివైచి గుడ్డను దిట్టముగా నేతిలోముంచి యొకకొనకు జనుపనారత్రాడుకు వ్రేలాడగట్టి, దానికి సూటిగా క్రింద భూమిమీద పళ్ళెమునిండ నీళ్ళుపోసి నీళ్ళలో పువ్వులను చక్కగా బఱచి, ఆగుడ్డకొనకు దీప మంటించి హరిశాస్త్రులు వెలుపలికి వచ్చెను. అత డీవలకు వచ్చిన రెండుమూడు నిమిషముల కెల్లను గుడ్డ యంటుకొనగా మండుచుండెడుచమురుబొట్లు నీటిలోబడి టప్పుమని మనుష్యునిమీద దెబ్బ వేసినట్టు చప్పుడు కాసాగెను. ఆవల బొమ్మరాళ్ళవఱకును కాలినప్పు