పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
ఆఱవ ప్రకరణము

మాణిక్యాంబ ధూపమువేసిన మీదట నిష్టదేవత తన కావేశమయి నట్లు కనబడి తాను రుక్మిణి పెనిమిటినని బయలపడి , కాని దేశములో దిక్కుమాలిన పక్షినయి చచ్చిపోతినని యేడ్చుటాయే గాక తాను రుక్మిణి మీదమోహముచేత వచ్చితిననియు , ఆమెనుదనవద్దకు తిసుకొని పోయెదననియు జెప్పెను. ఆసంగతులు చెప్పునప్పుడు మాణిక్యాంబయు సుబ్బమ్మయు గూడ నేడువ సాగిరి ఆ యుద్రేకము శాంతి పొందిన పిమ్మట వారా మాలదానికి సమర్పించ వలసినదాని నర్పించి యింటికి బోయిరి. రుక్మిణికిని రాత్రులు కలలలోను పగలు సహితము కన్ను మూసికొను నప్పుడునుమగడెదుటా గనబడు చుండెను. ఒకా నొకప్పుడు మాటాడునట్లు సహిత మామెకు వినబడుచు వచ్చెనుగాని యా మాటలనామె గ్రహింప గలిగినదికాదు. ఆమె యొకానొకప్పుడెవరో గుండెల మీద నెక్కి కూరుచున్నట్టు తలచి నిద్రలో గేకలు వేయు చుండును.

ఇట్లుండగా నొకనాడు హరిశాస్త్రులు వికృత వేషముతో మరల వచ్చి రుక్మిణి చేయిచూచి భూతనాడి యాడుచున్నదని చెప్పెను. బై రాగిచేత విభూతి పెట్టించిరి కాని, అందు వలన రుక్మిణీ కేమియు గుణ మగపడలేదు . ఒక నాడొక బుడబుక్కల వాడు నెత్తి మీద తలగుడ్డ లో బక్షియీకలను బుజము మీద వేపబెత్తములు కట్టయు వీపున బెత్తములకు వ్రేలాడ గట్టిన పెద్దతోలు సంచియు నుండ డక్కి వాయించుచు వచ్చి , మాణిక్యాంబ శకున మడిగినపుడు గీతలును బొమ్మలును వేసి యున్న తాటాకుల పుస్తము చూచి తీర్ధమునకు వెళ్ళిన దినమున రావిచుట్టు మీద నిండి వచ్చి యొక కామినీ గ్రహమున సోకిన దినమున దిగదుడు పుపెట్టిన బోవుననియు జెప్పి యొక వేరుమొక్క యిచ్చి దానిని వెండి