పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
రాజశేఖర చరిత్రము

మొదట రుక్మిణికి శరీరము కొంచెము స్వస్ధపడ నారంభించినది కాని తరువాత రాత్రులు పలవరింతలు మొదలయినవి పుట్టి జ్వర మధికముగా సాగెను. అప్పుడు వైద్యుని బిలిచి జ్వర మింకను నిమ్మళించలేదేమని యడుగగా అతడు "రేవత్యామను రాధాయాం జ్వరో బహుదిన్ంభవేత్ " అని చదివీ యీ జ్వరము రేవతీనక్షత్రమున వచ్చినదికాన బహుదినమిలకుగాని పోదని చెప్పెను. కానియాతని మాటలయం దం తగా నమ్మకము చిక్కక గ్రామములోనున్న మఱియొక వైద్యుని బిలిబించి, రాజశేఖరుడు గారు రుక్మిణి జూపించిరి. అతడు చేయిచూచి పైత్య జ్వరమని చెప్పి , మూడుపూటలలో రుక్మిణిది వజ్రశరీరము చేసెదనని ప్రగల్భవచనములు పలికి, అతనియొద్ద మాటలేకాని మందులు విస్తారముగా లేనందున వాడుకప్రకారముగా 'లంఘనం పరమౌషధ ' మన్న యొక్క సూత్రమునే శరణము గావించుకొని లంకణములు కట్టనారంభించెను . అతడు నవజ్వరపక్వము కావలేనని పలుకుచున్నను లక్ష్యముచేయక , దినదిన క్రమమున రుక్మిణీ శుష్కించి యంతకంతకు మఱింత బలహీనురాలగుచుండుట చూచి యాతని యాతని వైద్యమును మానిపించి , మరల మొదటి వైద్యునే రావింపగా నతడు వెంటనే పధ్యము పెట్టించి యౌషధ సేవ నారంభించచెను. అ యౌషధబలమున వ్యాధి కొంచెము మళ్ళుముఖము వట్టినను ఒక పట్టున నిశ్శేషమయినది కాదు.

ఈ లోపల మాణిక్యాంబ యొక యాదివారమున నాడు నాలుగు గడియలకు దెల్లవాఱుననగా లేచి సుబ్బమ్మను వెంటబెట్టు కొని యెవ్వరును వెళ్ళక ముందే ముందుగా దాము వెళ్ళవలెనని బయలుదేఱి కొమార్తెమీద ప్రేమ చేత స్వయముగానే కోరలమ్మ గుడికి సోదె యడుగుటకయి వెళ్ళెను. ఆగుడి యొద్దనున్న మాలది