పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/870

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
కామడీ ఆఫ్ ఎఱ్ఱర్సు

ఏజి --- జౌ! మేలు ! నాకిదియ ప్రసాదమరయ;
     నీమాటయెల్లను నెఱవేఱునేని,
     యీదినమ్మునఁ గ్రుంకునినునితోఁగూడ
     నాదుకష్టంబులు నాశంబులు నాశంబునొందు.

పభు --- అవునోయివర్తక ! యడిగెద నొకటిఁ,
     జవిబుట్టఁదెల్పుము సంగ్రహంబుగను,
     మీదేశమునుబాసి మెలఁగంగనేల
     మాదేశమునకేల మఱివచ్చితిపుడు ?

ఏజి --- వచియింపరాని నాబహుళదుర్దశల
     వచియింపుమనుకంటెభారంబునొకటిఁ,
     బూనుపఁగారాదు పొనఁగవామీఁద;
     ఐననులోకంబు లన్నియునాదు
     దురవస్ధలెల్ల నాదోషంబువలన
     దొరలక, విధిచేతఁ దొడరినవౌటఁ
     దెలిసికొంటకు, నాదు స్ధీరవిచారంబు
     సెలవిచ్చునంతయుఁ జెప్పెదనిపుడు:
     సరకాజియాలోన జన్మించినాఁడ;
     పరిణయమయినాఁడఁ బడఁతుకనోర్తు;
     ననుఁ జేసికొనకున్న, నన్నులమిన్న
     జననుత మైనట్టిసౌఖ్యంబుఁ గాంచు;
     దైవంబు మాయెడ దయమాలకున్న
     నావలిననుగాంచు వాతిసౌఖ్యంబు;
     ఆనందముననుంటి నామెతోనేను;
     నానాఁటవర్ధిల్లె నాకల్మిమిగుల,