పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/871

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
ప్రధమాంకము

పరదేశమున నాదుపనులను జూచు
మరియాదగల బేరిమరణంబుదాఁక,
ఎపిడామిననునకు నేఁజేసినట్టి
యపరిమిత సముద్రయాత్రలవల్ల.
తెరువుననొకమూల దిగఁబెట్టిచన్న
సరకులనైనను జాగ్రత్తసేయు
ఘనుఁడాతఁడెలనాగకౌఁగిలినుండి,
నను సమాకర్షించెఁదనదేశమునకు;
ఆఱుమాసములైన నరుగకమున్న
తీఱనివిరహంపుఁదీవ్రవేదనను,
చిక్కిసగంబయి చక్కెరబోఁడి
గ్రక్కునఁబయనంపుఁగార్యముల్నడపి,
సేమంబుతోవచ్చి, చెచ్చెరఁదాను
మే మున్నసీమను మేరమైఁజేరె:
చిరకాలమచట వసింపకమున్న
తరుణియిక్కఱముద్దుతనయులఁగాంచె;
చిత్రంబు! చూడ నాచిఱుతవారెంత
మాత్రము భేదమన్మాటయులేక
పేరులచేఁదక్క వీఁడువాఁడంచు
నారయరాకుండనలరారిరంత;
అనిమిషననె యాసత్రమందె
మానినిబీదది మఱియోర్తుకనియె,
నాదారిమగవారి నమడబిడ్డలను
భేదమేమియులేక విలసిల్లువారి:
నే, వారిజనకులు నిరుపేదలౌటఁ,