పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/869

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
ప్రధమాకము

ఏల ? యన్నను ... మాకు, నెపుడుఁజివ్వకును
జాలఁ గాల్దృవ్వునచ్చటివారలకును,
అప్పగిదిని నైన నధికవైరంబు
నప్పటినుండియు, నొఫ్ఫసంఘంబు
చేరి, యిచ్చోటమావారలచేత,
ఇఁకముందువాణిజ్య మొకరితోనొకరు,
ఒకరిపట్టణ్ముల నొనరఁగానొకరు,
కావింపకుండంగఁ గట్టుదిట్టములు
వావిరిఁబుట్టింపఁబడె ననైకములు.
వినుమంతయేకాదు; వెలయమీదేశ
మునను జన్మించినజనుఁడు మాదేశ
మందు సంతలఁగాని యంగళ్ళఁగాని
కందోయి కొక్కింత కననయ్యెనేని,
మాసీమ మనుజుండు మఱియెవ్వఁడేని,
మీసీమనందైన మెలఁగునయేని,
హాయిగానుండుటకు నదనున, నొక్క
వేయివరాల నర్పించినఁదక్క
జీవంబు లప్పుడ చెచ్చెరఁబోను;
ఆవానిసొమ్మెల్ల నధిపుపాలౌను.
ఇక్కడనీయొద్ద నెసఁగుసొమ్మెల్ల
నెక్కువవెలఁగట్టి యిచ్చిన, నల్ల
నూఱువరాలకె న్యూనంబు కానం
దీఱదు జీవము లైగక, నీయాన