ఈ పుట ఆమోదించబడ్డది
కామడీ ఆఫ్ ఎఱ్ఱర్సు.
ప్రథమాంకము.
<poem>
1. ప్రదేశము ౼౼ ప్రభు మందిరమునందలి చావడి.
(ప్రభువు, వర్తకుఁడు, కారాగృహాధిపతి ఉద్యోగస్ధులు ఇత
సేవకులు పవేశించినమీఁదట.
ఏజియ౯ ౼౼ నరపాల ! యరుదెమ్ము ననుశిక్షసేయ,
మరణదండమున మాను నావెతలు.
ప్రభు ౼౼ వర్తక ! మఱియేమపలుక కుమింక
వార్తులకొఱకుఁగానకట ! మాలంక
ధర్మశాస్త్రంబుల తగవేదఁగాను,
గూర్మిఁ, బాక్షికబుద్ధిఁ గూరను నేను.
వేయేల ? మాదీవిబేరులఁ బట్టి,
న్యాయమార్గమునందె నడచెడునట్టి
వారి, మీచట్టాలఁ బరీఁగించుకిన్న
క్తూరశిక్షలకును గుఱిసేయ మొన్న, ౼౼
ప్రాణదానమునకు బదులుగానొసఁగఁ
బాణిని బంగారుపస లేమిఁ బొసఁగఁ ౼౼
మీరాజు, దతమాలి, మీఱిమావారిఁ,
గ్రూరుఁడై, చంపినకొఱగామి, నోరి !
పుట్టినవైరంబు, గట్టిమచ్చరము:
నెట్టును మీమీఁద నెప్పుడుఁగరము,
జాలిపుట్టఁగ నీవు, జడినిప్పులొలుకు
క్రాలెడుమావేఁడికఱకుఁ జూవులకు.
<poem>