పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/867

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
పథమాంకము
చరణములు

    ౧. దురహంకృతి నెవ్వరు బొంకులకున్
          జొరకుండఁగ నీవరచాతురిచే ౼౼ కరుణింపుము
    ౨.జనసంఘపుమేలునకై నరులె
          ల్లను దిన్ననిత్రోవను బూనఁగ వే ౼౼ కరుణింపుము
    ౩. ఇదిసత్పథ మియ్యదిదుష్పధమం
          చెదనెల్లరు నొప్పిదముగొనఁగా ౼౼ కరణింపుము
    ౪. అనుమానము నల్లను మాని సతం
          బును సత్యము నోర్పునఁగై కొనగా ౼౼ కరణింపుము
    ౫. గతిగానక దుస్ధ్సితిఁ గుందెడియా
          పతిహీనల సంతత వత్సలత౯ ౼౼ కరుణింపుము

    జగ: ౼౼ భోజనమునకు ప్రొద్దెక్కుచున్నది. నేనిప్పుడు సెలవు
పుచ్చుకొందునా?

    వీర ౼౼ మంచిది. గౌరీనాధముగారు మిత్రులతోఁగూడ నేటిమ
ధ్యాహ్నము మాయింటికి వచ్చెద మన్నారు. వారియిల్లు మీయింటికి
వెళ్ళెడిత్రోవలోనేగనుక, సాధ్యమయినంతశీఘ్రముగా రమ్మని మనవిచేసి
మఱివెళ్లుము.

   జగ: ౼౼ మంచిది ముందుగా వెళ్ళువప్పుడే ఆయనతోఁ జెప్పి
ముఖ్యముగాఁ బంపెదను. (అని యిద్దఱువెళ్ళుచున్నారు.)