Jump to content

పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/850

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నీతిదీపిక

శాన, దొంగతనము గావింపనెందైన
శిక్షతప్పకుంట సిద్ధమరయ.

ఆ.ఒరులమాయచేసి సిరిగాంతు ననుకొంట
వెఱ్ఱితనముగాని వేఱుగాదు;
దాన, ముప్పతనకె తప్పకఘటియిల్లు;
బరుల జెఱుచువాడుబాగుపడునె?


పరోపకారము.

తే.కడుపై కై లాసమనియెంచి గాసిపడక
శ్రమమునకునై ననోరిచి, శక్తికొలది
బరులకుపకార మొనరింపబాటుపడుదు
రాకలియుడప్పిపాటింపక లఘుమతులు


వివిధధర్మములు.

తే.భూమిమీదను మనమిట్లు పట్టుటెల్ల
భోజనంబుకేయని, మూఢమతులు
తిండియేలోకమనియుందు రొండుచింతు
దక్కి, ధర్మమునందై న దలపులేక.

ఆ.మంచివాడువుడమి మాటాడుమల్లగా
బలువయెపుడుగొంతుపగులనఱచు;
ముఱికికాల్వలెపుడు ంరోగినలాగున
నదులుసేయుచున్మె రొదలనెందు?

తే.భాగ్యహీనులనైన, సేవకులనై న
బరుషవాక్యంబులాడుటపాడిగాదు;
దాన, బెట్టినపెట్టెల్ల గానజేరు;
వదన జేసినమేలును బదట గలుయు.