Jump to content

పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/851

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నీతిదీపిక

తే. ఎదుటివారిని మర్యాద నెలమిఁజేసి,

          తానుమర్యాదబడయంగఁదగునునరుడును;
        వారి నటుతాను గౌరవ పఱుపకున్నఁ
        దనకు గారవమబ్బదు; తథ్యమిదియె

ఆ. మంచికార్యమునకు, మానక యెప్పుడు

          యత్నమాచరించు  టర్హమగును  ;
           మొదలఁగాకయున్న, బదరకమరచేయ
          వలయు;గానినడుమవదలఁదగదు.

ఆ. చెడ్డకార్యమునకుఁజేరరాదెప్పుడు;

          చేరేనేనిమేచేటు వచ్చు;
           హీనకృత్యమందు నెఱుఁగకచొచ్చినఁ
          దెలిసినపుడెవిడిచి  తొలఁగవలయు.

ఆ. అల్పబుద్ధులెప్పుడన్యులతప్పుల

           వెదకుచుందు ; రల్పవిషయములనె
           గొప్పగాఁగనెంచి, కోపంబువహియింతు;
           రలుకవిడువకుందు రనవరతము.

ఆ. అలఘుబుద్ధులెపుడు నన్యులగుణముల

             నభినుతింతు రెఱిఁగి  ; యవగుణములఁ
          దడవకుందు ; రలుకఁదడవుగఁబూనరు;
              సైరణను వహింత్రుసంతతమును.

ఆ. తనకుఁజేయుమేలు మనమునఁగుక్కయు

              నెఱిఁగిసతముస్వామియిల్లుగాచు ;
             మేలుమఱచునేని, మేదినిమనుజుండు
             కుక్కకన్నఁగొంతతక్కువరయ.