పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/849

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

నీతిదీపిక పవిబనుచుట

ఆ.ఆజ్ఞ చేసినట్టులన్యులబనిచిన,
జెప్పుపనిని వారుచేయకుంద్రు;
చేసిరేని, దాని జెడగొట్టుదురుచాల,
హృదయమందసూయపొదలుగనుక.
ఆ.పరులవేడుపట్టు పనిచేయ బనిచిన
జెప్పుదడవదాని జేయుచుందు;
చేయుపనియుజాల శ్రేష్ఠంబుగానుండు,
మనసు కుదిరిచేయుమహిమకతిన.
తే.చెలిమిమైజేదు మేసింపజెల్లుగాని,
బలిమిమైబాలుద్రావింపబాటుగాదు
కాన, మంచితనముననే కార్యమెపుడు
దీర్పవలె; గానిపనిగాదతీవ్రపడిన.
ఆ.ంరుచ్చిలగ, రాజుమూన్మున్నదండించి,
దండుగగొనుదొంటిధనముగూడ
నిరుగుపొరుగువార లెప్పుడునింద్రింత్రు;
పరమునందుజాలబాధతొడరు.
తే.ఎవ్వరునుజూడరనిమనమెన్నకొన్న
బావమదియెప్పుడై ననుబయలబడును;
గాని, దొంగతనంబు దాగదునిజంబు;
దీని నింతయులెస్సగాదెలియవలయు.
ఆ.ఎవరుజూడకున్న, నీశ్వరుడైనను
మనము సేయుకానిపనులగనడె?