పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/831

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
జాన్ గిల్పిన్


గీ. బలముగలయట్టి నెఱవింటివాని చేత
       విడువఁబడినట్టిబాణంబువిధముగాఁగఁ
      బఱచె నశ్వంబు , దానిపైఁ బఱచెనతఁడు_
      కథయు సగమయ్యె నాకు నిక్కడకుఁ జూడ. 39

గీ. తనదుమిత్రుఁ డౌపట్టు వర్తకునియింటి
       వెలుపలఁదుదకుఁదురగంబునిలుచు దాఁక
       దవ్వుగాఁబోయె గిల్పిను, తనకొకింత
      యిష్టమేనియ లేకుండ నింతలోన. 40
 
గీ. తనదుపొరుగువాఁ డావేషమునను వచ్చు
       టద్భుతంపడి చూచి పొగాకుగొట్ట
        మచటఁ బడవైచి, గుమ్మంబునండ కరిగి
      తొలుతనీరీతి నాతనిఁ బలుకరించె 41

గీ." వార్తలేమిటి ? యేమిటి? వడిగఁజెప్పు;
          చెప్పు నీవర్తమానంబు శీఘ్రముగను
          వట్టితలతోడ నేటికి వచ్చి తీవు?
          కదలి యిచటకు రానేల మొదలు నీవు? 42
     
గీ. అవసరోచిత మైనట్టిహాస్యమందు
       మిగులఁ బ్రియుఁ డౌటఁ దన నేర్పు మెఱసి యతఁడు
        ముఖవికాసంబు నటియించి , మురువుదోఁపఁ
        బట్టువర్తకుతోడుతఁ బలికెనిట్లు. 43

గీ." వారవం బిటు రాఁగోర, వచ్చితేను;
         చక్కఁగా జ్యౌతిషము చెప్పఁజాలితిని
         నాకృతశిఖ కుళ్ళాయినన్నుఁజేరు;
        తెన్నునడుమను నవిపయున్న విపుడు" 44

గీ. ఆత్మసఖుఁడు కుతూహలాయత్తుఁ డగుచు
       నుంట కెంతయు నలరారి, యెక్కమాట