పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/832

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
జాన్ గిల్పిన్</centert>


యైన మాఱుగాఁ బల్కక, యవుడ తనదు
భవనమును జొచ్చి యాపట్టువర్తకుండు. 45

గీ. కల్లజుట్టు టోపియుఁ గొంచునల్ల వచ్చె
మందిరమునుండి ; రెండునునందముగనె
యుండె_ జుట్టది వ్రేలాడుండెవెనుక
కరముఁగుళ్ళాయి చెడ్డదికాకయుండె. 46

గీ. వానిరెంటిని బైకెతి పట్టిచూపి
తనచమత్కారమును దోఁపననియెనిట్లు
కనఁగ నాతల నీతలకంటె రెట్టి
గాన సరిపెట్టుకొనవలెవీని నీవు.' 47

గీ.నీదు నెమ్మోమునందును నెలవుకొన్న
దుమ్ము నించుక దయచేసి తుడువనిమ్ము ;
నిండ నీ వాఁకిలిని గొని యుండవచ్చు;
నిప్పుడిటనిల్చి భుజియించి యేగుమవల 48
 
గీ. అందుమీదఁను జానిట్టు లనియె _ " నేఁడు
నావివాహదినము ; వేరునందు నేను,
భార్య యెడ్మాంటనున, విందుఁ బరఁ గఁగొన్న
లోకమెల్లను మముఁజూచిలోన నగరె?" 49

గీ. వాని నాలించి తనతేజివంక మరలి
యనియె _ ' నే నిప్డు గుడువంగఁ జనఁగవలయు ;
నీవు నీయిష్టమును బట్టి యిటకు వచ్చి
తట్ల నా యిష్టమునుబట్టి యరుగు మరల" 50
    
గీ. అహహ! దురదృష్టవాక్యంబు ! వ్యర్ధదంభ !
మందునకు ఁదొడనే తగినట్టులయ్యె_
నంచు ముచ్చటించుచునుండ నఱచెనొక్క
ఖరము సంగీతసరణిని గట్టిగాను. 51