పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/818

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
పథిక విలాసము

దాము మాత్రంబె స్వతంత్రులై యుండుచో
నొక్కపక్షమువార లొకటఁజేరి,
యదియ స్వతంత్రతయంచును బిలువంగ
ననుమతించుటఁ గనుంగొనినపుడు,

వేగ నాసన్న మగుచున్న పెనువిపత్తు,
   గురుతరోద్రేకమును బురికొల్పినపుడుఁ
   దక్క నాయాత్మ శాంతతఁదాల్చినపుడుఁ:,
   దగదు పోరికికత్తులు దాల్చిలేవ.

మ. సమకూర్చుం బ్రతిధర్మదసతయు విజేచ్ఛన్ నూత్నశిక్షాస్మృతుల్;
నమలున్ బీదలఁజుట్టముల్; ధనయుతుల్ శాసింత్రుచట్టంబులన్
స్వమహిన్ దాసులవిల్చు పొంటె శబరుల్ సంచారముల్చేయుదే
శములన్ దాసులనుండి సంపద యథేచ్చన్ గొల్లకొట్టంబడున్.

మ. భయకారుణ్య నయోగ్రకోపములు పైపైఁ బొంగి, గోప్యస్థితిన్
బయల,బెట్టుచు, నుబ్బియున్నమనసున్ బాహాటమున్ జేయ, ని
ర్దయులౌ నీమనుష్యులంవిడిచి పర్వంజూతు దేశాభిమా
నియు భీరుండును గొంతకొంతయగుచున్ బృథ్వీపతిం జేరఁగన్.

చ. ధర నధికారకాంక్ష తొలుతన్ నృపభూతినెదిర్చి, యాగతిన్
     సరగున గౌవంబు జననస్థలమందెకలంచి, రాజ్యమున్
    జరప మనస్సుపై ద్విగుణ్శక్తిని గల్మికి నిచ్చినట్టియా
    పరమనికృష్ణకాలమును, భ్రాత శపింపుము నీవునావలెన్.

చ. కనమె నిరర్ధలోహమునకై యుపయు క్తజనుల్ 'బ్రిటానియా'
      జనాబహుళాబ్ధితీరముల సత్పరివర్తమొనర్పఁ గా బడన్?
      అని మొనఁ గల్గుతజ్జయములన్నియు, దీపములాఱునప్డు భ
      గ్గునగడుమండి మృగ్గుగతి, గొబ్బననాశముఁ గూర్పఁ గానమే?