పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/817

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
పథిక విలాసము

గ్రూరమహీపాలకుపితాసి నొక్కట
బాధలుపడ నలవడితివీవు;
గర్వసంయుత తిరస్కారంబుచేనొండె,
జెలిమిఁ బెంచుకృపార్కు చేతనొండె,
సమరీతిఁ జేటొందుక్షణభంగురం బైన
యలరుఁ బోలెడుదాన వై ననీవు,
 
సతతమును మాఱుచుండు దేశంబునందు
నీవికాసముల్ స్థిరముగా నిలుచుఁగక్వత!
వానిని సురక్షితముగఁ గాపాడుకొఱకె
యొకటనేను నిరోధించుచున్నవాఁడ.

క.ఆలోచించెడువారలె, పాలింపఁగ వలయుఁ బాటుపడువారల నం
చీలోకానుభవం బది, వాలాయముఁ దెలుపు సరిగఁబ్రతిదేశమునన్.

చ. క్షితిని స్వతంత్రతాగరిమ చేయఁ గజాలు ప్రయత్న మంతయున్
      హితముగ నెల్లవారలపయిన్ సమభారముఁ బూంచుటేకదా?
     అతిఘనవృద్ధి నొక్క తెగ యందఱమించి యతిక్రమించినన్
    హతమొనరించు దానిద్విగుణం బగుభారము క్రిందివారలన్.

గీ. మించికొందఱు మాత్రమె కాంచునపుడు
      దాని స్వాతంత్ర్యమంచును దలఁచువారు
      సత్యమర్ధించుదానికి సర్వమునునకు
      నుర్వి నెంత యంధులుగాఁగ నున్న్నవారు;

సీ. స్వాధికారంబును వ్యాపింపఁజేయంగ
రాజాధికారంబు హ్రస్వసఱిచి,
ప్రతిపక్షనాయకుల్ ప్రముఖులై సింహాస
నముఁ జుట్టుకొనఁగఁ బెసంగెనపుడుఁ,