పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/819

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
పధిక విలాసము

మ. కనమేసంపద స్వీయవైభవ మహోత్కర్షాభిరక్షార్ధమై
తనభృత్యాళికి నిండ్లుగట్ట విజసత్వంబుం గడుంగూర్చి, యొ
య్యన వెన్కం జిఱుపల్లియల్ చెదరి యందందున్న క్షేత్రంబులన్
జనశూన్యంబగు మధ్యడంభమున విశ్రాంతిందగం బొందఁగన్.

క. కనమే మనమకటా యొక,
      ఘనుఁడు వినోదంబుకొఱకుఁగా నిడునాజ్ఞన్
      జనసంచారము సతముం
      గని మునుకలకలను నవ్వుగ్రామముకూలన్?

సీ. ఆజ్ఞానువర్తియై యలరెడుపుత్రుండు
నత్యంతజీర్ణాంగుఁడై నపితయు,
వినయశాలినియౌచు వెల సెడుమాతయు
ఘనలజ్జగలయట్టి కన్యకయును,
నడవినిబ్రవహించు 'నాస్విగో' నది యెందు
                                            స్వీయకచ్చములవ్యాపింపఁజేయు,
నెట 'నయగ్రా ' నదిఘటియించు బధికతఁ
బిడుగులవంటి చప్పుడులచేత,
      
నట్టి పశ్చిమజలధికి నవలనున్న,
దేశముల నివాసార్ధమై తిరుగఁగసమె
స్వస్థలంబుల విడిచి నిర్భంధమునను,
మెలఁగుశోచనీయకుటుంబలనుస్మనము?

చ. తవిలిమనుష్యుతొస్ మృగముతానెట రాజ్యముపాలుగోరునో,
యెవుచునొ యెఱ్ఱ 'యిండియనుఁ' డెచ్చటఁ జూపుగుఱిన్ శరంబు, న
య్యవిరళకాననాంతరములందు భయంకరమైన త్రోవలం
దెవఁడయినన్ సకృత్పథికుఁడిప్పుడుకూడనటం జరించుచోన్.