పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/809

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

<poem>పథికవిలాసము తక్కువ వయ్యువేడుకలు , తద్దకుటూరము పేదదయ్యు , నల్ ప్రక్కలఁగాంచుఁ గాఁపు తనభాగ్యమె యెల్లర భాగ్యమౌటిటన్ .

చ . తనదుకుటీర నైచ్యమును దద్దయు గేలియొనర్పఁ, జెంగటన్ గనుఁగొనఁడెందు సౌధములు గర్వమునందల యెత్తుచుండఁగాఁ ; తనదగు శాకపాకకలితంబగు భోజన మేవగింపఁగాఁ గనుఁగొనఁడెందు విందు ధనికప్రభులున్నతితోడఁ జేయఁగన్ .

గీ .  మూఢతలఁ  గష్ట్ములయందుఁ  బుట్టి  పెరిఁగి
      యతఁడు  శాంతస్వభావుఁడై   యలరు  కతనఁ
      గోర్కులెల్ల   నాతనికి  సంకుచతఁగాంచి
      యతని న ద్దేశమునకు  నర్హుఁ  జేయు .
క .  వేకువ ,  నుత్సాహముతోఁ
      గైకొని  లఘునిద్ర ,  మేలుకాంచి ,  సుతీక్ష్ణా
     స్తోకసమీరముఁ  బీల్చుచుఁ
     ప్రాకటగతితోడఁ   బాట   బాడుచు ,  నడచున్ .


ఉ .గాలమునైన  వైచు  నుదకంబున ఁ  జేఁపలఁ  బట్ట  నోర్పునన్ ;

జాలఁగ దుర్గమస్థలిని నాగలినై నను నీడ్చుఁ దెంపునన్ ; వాలనమంచుజాడలనుబట్ట దుహం గనిపెట్టి , లోపలన్ గ్రాలి పెనంగుకాననమృగణ్బును నై నను నీడ్చుఁ బైటికిన్

చ . పనులవి యెల్లఁ దీర్చుకొనివచ్చి నిశందనయిల్లు చేరుచున్ దనదుకుటీర మందిరమునన్ గృహరాజనఁ గూరుచుండి , వే డ్కను జలిమంటఁ గ్రాఁగుచుఁ దగం చిఱునవ్వును బూని, చుట్టునుం గనుఁగొను మంటచే మెఱసి క్రాలెడుబిడ్డలతళ్కుఁ జూపులన్ .

చ . అతని ప్రియాంగనామణి గృహస్థితపాత్ర సమృద్ది కొందుచుం గుతుకముఁ బల్లపై శుచిగఁగూర్చును భోజనభాజనంబులన్;