ఈ పుటను అచ్చుదిద్దలేదు
<poem>పథికవిలాసము
గాలంబుచేతను గూలి రూపముమాఱి
బీటలువాఱఁ గంపిల్లు చోటఁ
బాడుగోడలలోన వీడక యచ్చోటఁ
జచ్చినపూర్వుల సరకుగొనక
నిలువంగనీడను నెమకుకొనెనుకాపు
బీదకుటీరంబు వేయినొకటి
వేసినవరుండేల మున్నట్టిపెద్దయిల్లు
కట్టవలెసరొ యనుచు నక్కజముపడుచుఁ
దనదుగుడిసెనుమందస్మితంబుతోడఁ
గనుచుఁదానె ఘనుఁడనెంచు గర్వపడును .
చ . చనుమిటనుండి నీవిఁకను స్వాంతమ ! యెచ్చటఁ గర్క శస్థలిన్
ఘనతరమర్త్యు లుద్భవము గాంతురో , యెచ్చట వెల్లనైన ‘స్విస్’
జనులు ప్రభంజనాహతశాంతము లొపఁగ రూక్షభూమి బ
ల్మిని లఘుభు క్తిఁగాంచఁ బెకలింతురొ యచ్చటుఁ జూత మింకిటన్ .
చ . మనుజుని , నక్కు- సద్భటుని , మంజుకృపాణముఁ– దక్క ,నుగ్రవం
ధ్యనగములియ్య వియ్యెడఁ దదన్యఫలంబుల , గొడ్డుకొండలన్
దనర నలంకరింపవిటఁ దాము వసంతసుమంబు లేవియున్ ;
ఘనముగ నేఁచు నిందుఁ జలికాలము మాధవమానమందునున్ .
క . మలయానిలుఁ డెన్నండును
వలవున వరియింపఁ డిచటి బలుగుబ్బలులన్
బలుమఱు నుల్క లురాలును ;
గలుషమహావాతములను గావిరి గప్పున్
ఉ . ఇక్కడఁగూడ భూస్థితికిఁ దృప్తి ప్రతిక్రియఁ జేసి , దానిదై
నిక్కుదురాగ్రహం బుడిపి , స్వీయమహత్త్వముఁ జూపఁ గల్గెడున్ ;