పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/763

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
ప్రథమాశ్వాసము

క. ఆరసి కర్జముఁ గని యి
బ్బారిని నలమలవిలుగలవాఁడడఁపంగా
నేరుచు నని పొంగి వడిం
జేరి రొకట వెండికొండచెంగటి కెలమిన్.

వ. అటువలె వెండికొండఁ దఱియం జని మేలిమిగద్దెమీఁదన
చ్చొటఁ గొలువుండి వేడుకలఁ జొక్కెడు మిక్కిలికంటిదేవరం
బొటపాటఁ గన్నులం దొరఁగి ముమ్మరమైచను నీఆటిజాలుతో
నటమటమారఁ గామచి మది నళ్కుచు నెయ్యమునుం బునంగొనన్.

గీ. ఒదుఁగువాతున నిలుచుండి యొక్క పెట్టుఁ
జేతులు మొగిడ్చి జోహారుఁ జేసి నిలిచి
వేల్పు టెకిమీఁడు మున్నగా వేల్పులెల్ల
నెలుఁగు కుత్తుకఁ దగులంగ నిట్టు లనిరి.

గీ. ఏనుమోముల వేలుపాయిదె జోహారు
ఇవముగుబ్బిలియల్లుఁడ యిదె జొహారు
ఇంచువిలు కానిపగవాఁడ యిదె జొహారు
ఎక్కుడుకనుల దేవరాయిదె జొహారు.

చ. ఉడుగనికిప్కతోఁ గడలి యొక్కట నెక్కడగన్నఁ దామయై
కడఁక ను కేశుబిడ్డలు జగంబుల నేపఁగఁ దల్లడిల్లి యి
య్యెడలను ముజ్జగంబులను నేలెడు దేవర వీవటంచు నీ
యడుగులు పట్ట వచ్చితిమియారసి మామొఱలాలకింప వే.

క. కాల్చిరి జన్నపుసాలలు
కూల్చిరి దేవళము లెల్ల గోడలతోడన్
బీల్చిరి మానిసినెత్తురు
రాల్చిరి యేలికలతలలు రవణంబులతోడన్.