Jump to content

పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/764

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
శుద్ధాంధ్రోత్తర రామాయణము

ఉ. ఏమని చెప్పువార మలయీర స మప్పొలదిండ్ల బారిచే
నేమును బోవఁగా వెఱతు మెప్పుడు జన్నపుఁబాళ్ళు గైకొనం
దామును గుట్టమీఱి జడదారులు మానిరిముక్కు పట్టఁగన్
బ్రెముడి బొట్టియల్ విడిచిపెట్టిరి యొజ్జలమోము చూడఁగన్.

క. మేమే జేజేదొరలము,
మేమే జగములను నెల్ల మిన్నల మనుచున్
బాము లిడం దొరఁకొని రా,
బాములు కడతేర్చి మమ్ముబ్రతికింపఁగదే.

క. అని ంరొక్కి తన్ను వేఁడిన
వినుసిగరాయండు వారి విన్నప మెల్లన్
విని కనికర మెదఁ బొదలఁగఁ
గనుఁగొనలం బిన్ననవ్వు గదురఁగఁ బలికెన్.

క. మీముందఱ నిజ మాడెద
మోమోటలు కటిపెటి మొఱకుల వారిన్
నేమడుఁపనోప వెన్నుని
సేమంబునఁ గానఁబొండుఁ జేకుఱుఁ గోర్కుల్.

క. వెన్నుఁడు దక్కఁగ నొండకఁ
డెన్నఁడు గెడపంగఁజాలఁ డీరక్కసులం
దిన్నఁగ మీ రిపు డాతం
డున్నెడ కరుగుండు నెమ్మి యుల్లము గదురన్.

క. ఆకై వడి మలవిలుతు2ండు
మూఁకగఁ దను వేఁడు వేలుపులతో ననఁగా
నేకడఁ గొలిచెవారలఁ
జేకొని కాపాడ మీకె చెల్లు నటంచున్.