పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/762

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"""శుద్ధాంధ్రోత్తర రామయణము

క. పువ్విలుతుని వాలారుం
గ్రొవ్విరితూపులొ యనంగఁ గొమరారెడులే
జవ్వనులం దనకూఁతుల
మువ్వురఁ గొనివచ్చి యిచ్చె ముగ్గురికి నెలమిన్.

వ. అందు మాల్యవంతుడు సుందరి యనుతన వెలందియందు వజ్ర
ముష్టియు విరూపాక్షుండును దుర్ముఖుండునుసుప్తఘ్నండును యజ్ఞ
కోపుండును నున్మత్తుండును మత్తకుండును ననునేడుగురుకొడుకులను
నిల యనుకూఁతునుం గనియె సుమాలికిఁ గేతుమతి యనుప్రోయాలి
యందుఁ బ్రహస్తుడును నకంపనుండును వికటుందును శకటముఖం
డును ధూమ్రాక్షుండును దండుండును సుపార్శ్వుండును సంహ్ర
దియుఁ బ్రఘనుండును భాసకర్ణుండునునను పదగురుకొదుకులును
బకయుఁ బుష్పోత్కటయుఁ గైకసియుఁ గుంభినసయు నను నలువురు
కూఁతులునుం గలిగిరి మాలివసుధ యనుతన వాల్గంటి యందు నలుం
డును హరుండును సంపాతియునను నలుగురు కొమాళ్ళం గాంచె
వారె విభీషణునకుం బ్రెగ్గడలై వెగ్గలంపు టగ్గలికం జెన్ను మీఱిరి.

గీ. ఇల్లు తామరతంపరై యేపుఁ జెంది
జగములం దెందు నెవ్వారి సరకు గొనక
విఱ్ఱవీఁగుచుఁ గొడుకుల వెంటఁ గొనుచు
ముజ్జగంబులుఁ గలఁచి రాపొలనుదిండ్లు.

ఉ. వారలరాయిడి న్నొగిలి వాంచినవెల్ల లానిమోముఁదమ్ములం
గూరిన నెవ్వగం గదలి కోరిక లీరిక లెత్త వేల్పు లె
వ్వారలఁ జేరువార మిఁక వాసిగ నుండఁగ నెద్దితావిఁకె
వ్వారికి విన్నవింపుదుము వారలయాఱడి యంచు నెంచుచున్.