పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/761

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసమూ


రేప్రోల నరువాత నెల్లరనిద్దుర
      మిన్నేటియలుకుడు మేలుకొలుపు
నెందలిరతనాలు చింది పడఁ గడలి
    తావలంబయ్యె రతనములకును

నెచటియెలఁదోఁటగమి తాని యొసఁగి మింట
వేల్పుటాండ్రాకు మగలకు వేడ్క లొసఁగు
నెచటిపయ్యర లడతేరి యెల్లయపుడు
చెల్వలయుఁ జెల్వులయు సెజ్జ చెమటలార్చు

వ. అట్టిసింగారంబులకుం బుట్టినిల్లు గలుములకాఁటపట్టును బీదసాదల
కుంబసిడి కొటారును బెద్దలకుం బట్టుగొమ్మయు నయి లంక చె
న్నలరుచున్నది.

ఉ. లంకను జేరి మార్తుర నలంతులఁ బాఱఁగఁదోలి నెయ్యిరం
బొంకముగాఁగఁ గల్ము లిడి ప్రోచుచు మీసరిసాటివారితో
నంకిలి లేఁగొప్పతన మందఁగలారని వేల్పువడ్రవాఁ
డింకను గొన్ని పల్కు లెద కింపుగ మంతననుందుఁ

ఉ. సంతస మంది ముందఱను సామి హసాదని పెద్దయెల్గునన్.
వింతగఁ బల్కుచుం బసిఁడిబెత్తములెత్తి యదల్చి మూఁక నం
తంతఁ దొలంగఁదోలి పణిహారులు సూరెలు దారి చేయఁగాఁ
జెంతలఁ జేరి యొండొరులఁ జీరుచు దండులు వెంబడింపఁగన్.

గీ. కదలి పొలదిఁడ్ల యార్పు లాకసము ముట్ట
లంకఁ జేరిరి ముగ్గురుఁ గలంకఁ దేఱి
యంత వారలబీరంబు నలపు బలమి
యరసి నర్మదయ నెడునచ్చర నెలంత.