పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/760

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
శుద్ధాంధ్రోత్తర రామాయణము


క.ఓయీ వేల్పుల కందఱ,
కాయాకొలఁదుల నెదఱింగియందపునెలవుల్
సేయుటవలనను నూపే,
రేయెడలను నన్నె కెక్కి యెంతయు నలమె౯. 168

ఉ.కావున మాకునుం బసిఁడిగట్టున నై నను వెండికొండపై
నావల నైన మంచుమల నైనను గవ్వపుఁగొండ నైననున్
నీవెర వంతయు న్నెఱపి నిక్కపుఁజక్కనిమానికంబుల౯
ఠీవి తెలర్పఁగూర్చి యిపుడే యొడగూర్పుము పైఁడి మేడలన్. 169

క. అనిన్౯ జేతులు మోడిచి
యను వొప్పఁగ వారిమోములందునె చూడ్కుల్
పెనఁచి యడంకువతో నిటు
పనితెఱఁ గెఱిగించి నతఁడు వారలతోడ౯ 170

గీ.జమునికడయందుఁ బొలుపొందుసంద్రమందు
నెసఁగునొకదీవి పెనుఠీవియెల్ల మెఱసి
పుడమియందును నెందును బుట్టరాని
మానికమ్ముల నిమ్ముల మలఁచి తెచ్చి. 171

ఉ. వేలపుఱేనియానతిని వింతగఁ జేసితి వీఁడొకండు తొ
ల్వేలుపులార మున్ను గడువేడ్కఁ ద్రికూటముఁ నఁగఁ బేరున౯
గ్రాలెడు కొండకొమ్మునను నాతెలివెల్లను వెల్లడింపఁగా
నేలిన వారి కయ్యదియె యిమ్మగుని మ్మని నాకుఁ దోఁచెడు౯. 172

సీ.ఏవీటికిని నాల్గుక్రేవలందును జుట్టి
                                   సంద్ర మగ డ్తయై చదువులు నింపు
నేయూరిపెనుకోటఁ బాయక బురుజుల
                                 నేవున వేల్పులు కాపు గాతు