పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/743

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

<poem>ప్రథమాశ్వాసము

నువిదచేతులుపూదండలో సఁగుచుండు నింతినెమ్మోమువిరిదమ్మినెలమిగూర్చుఁ బూజసల్పెడుతఱియందుఁబూనిమీకు గట్టిగాననబోఁడిఁ జేపట్టవలయు .

మ . అన నెమ్మోమునఁ బిన్ననవ్వొలయ నొయ్యారంబుగాలేచి యా యన వెంటంగొని తల్లిదండ్రులను డాయంబోయి కాంపించి వ చ్చినకర్జంబు కరంబు వీనులలరం జెల్వంబుగా విన్నపం బొనరింపన్మది నుబ్బి మైకొనిరి వారొండాడఁగా లాఁతు లే .

ఉ . అంత నొకింత మంతనమునందుఁ గొమారు తలంపెరిం వా రెంతయు సంతసంబడర నింతిఁగొనం దమడెందమందు ని క్కింతయు నడ్దులేమి యెఱిఁగించిన మేలనివారు, దారును౯ వింతగ వియ్యమొందఁ గనువిందుగ నందఱు నందుఁ బొదుగన్ .

సీ . తమ్ములమ్ములనంది తరువాత నిరువురు బట్టలొండొరులకుఁ గట్టఁబెట్టి పెండ్లిపనులుచేసి పెద్దలరానించి తమవారితోఁగూడి తరలివెళ్ళి వియ్యపువా రిడ్డవిడిదిలోపల దిగి నాల్గు నాఁడులతంతు నడిపి మఱియు నలుకపానుపు మొదలై నవేడుకలెల్ల జరగవలసినట్లు జరగ నలరి నాగవల్లియైన నాఁటిరేయూరేగి యొప్పగింతలైన యప్పుడగవు తగవు లరణములును దగినయట్టులొసంగి పెండ్లికూఁతువారు బిడ్డనిచ్చి .<poem>