పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/744

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

<poem>శుద్ధాంధ్రోత్తర రామాయణము

గీ . అంపకముసేయఁబైనమైయపుడక దలి

       పండ్లికూఁతుతోఁగూడ  నాపెండ్లికొమరు
       నొక్కపాలికి  నెక్కించియుబ్బుమీఱ
       నింటికేతెంచెనుబులస్త్యుఁడింపుమెఱసి .

క . పిల్లదిపెద్దదియైనం

      దల్లియుఁదండ్రియును  వచ్చి  తమముచ్చట  పెం
      పెర్లను  దీఱఁగఁగొమరెకుఁ
      గొల్లిగ   సొమ్ములిడి  కోర్కికొనసాఁగంగన్ .

క . పెనిమిటిపెండ్లాముల మం

      తనమున   నొకటిగ  నొబర్చి  తల్లిదండ్రులు  వే
      డ్కను   దమయింటికిఁ  బోయిన
      వెనుకంజూ  లేరుపడియే  వెలఁదికినిచటన్ .

క . అన్ననబోఁడికడుపునం

      బున్నమచందురునివంటి  బుడతఁడు  వొడమెన్
      గ్రొన్నెల   దాలుపునాలికి
      మున్నలకొమరుండునెమ్మిఁబుట్టిన  పగిదిన్ .

ఉ . ముద్దులుమూటగట్టునలబొట్టియపుట్టుక యప్డు వేలుపుం

      బెద్దవులుంగతవ్ త్తడిని  మేడుకమీఱఁగ  నెక్కివచ్చి  వీఁ
      డద్దెసలేలు  నేలికలయం   దొకఁడై  మఱి  రొక్కపుందొరౌ
      నద్దిర   వీనిపున్నెమని   యానతి  యిచ్చి  చనెం   దనెంతటన్ .

చ . వడుగొనరించి యామొదలు ప్రాఁజదువున్ చదివించి తండ్రి నే

      ర్పడరఁ  దనంతవానిగను  నన్నిట   దిద్దిన   నాఱితేఱుటన్
      విడువనిపూనికిఁ  గాలిబొటవ్రేలొకయించుక   నేలమోపి  న
      ట్టడివిని   నొంటిమైఁ   దపసియై  యతఁడుండెను   దండ్రిపోలికన్ .