పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/735

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రధమాశ్వాసము

చ.వడివడి బారుతెంచి యెకపైదలి యూర్పులువుచ్చి నవ్వినన్
బడతుకయెర్తు చాలిపుణె నవ్వకు మంతయు రేపెగట్టిగా
గొడుకులతల్లి వౌదు వొకకొంచెము నాటికి దాచుకొమ్ము నా
నుడికె నెలంతయుం గడుపులుబ్బగ నవ్విరి కొమ్మలందరున్

క.ఒక్కతె చను మెనకస్తురి
నిక్కకనగవచ్చుచిలికి నిలుమని మ్రొక్కన్
విక్కుచు గొమరుని గసుమని
చక్కనదీవించె వీపుచరచుచు దానిన్

గీ.ఇట్లుమేలంబులాదుచునింతులెల్ల నెడగలుగబోయి రంతట నిచట బూలు
గోయ ద్ృణబిందుగారాపుగూతు రనుగు
జెలియతోగూడి పూదోట మెలగుచుండి

క. మునుపటు బెట్టిదముగ నా
యన వాక్రుచ్చుటలు విన్నయదిగదటుగా
పున వెరపన్నది యెరుగక
వెనుకము ముందుం దెలియక వచ్చలవిడిగన్

సీ.వేనలిసంపంగివిరుల నెత్తావికి
దెమ్మరల్ దరిచేర దేంట్లుపొర
జక్కనినెమ్మెముజాబిల్లి జిగికిని
నెల రాల్గరంగ గల్వలు చెలంగ

దనమేనిజవ్వాజితావికి బునుగుపి
ల్లుల డాయరాచిల్క లులికికూర
నలువైనక్రొవ్వెద నల్లమబ్బునకును
నిగసియంచలువీడ నెమ్ములాడ