పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/734

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శుద్ధాంధ్రోత్తర రామాయణము

బిలుతురొక చక్కి నెచ్చెలిపిండునిక్కి,
కలికిపలుకులఁ జిలుకలుకలఁగిచూడ
నడుతురొక క్రేవసొలపుగానడిమిత్రోవఁ,
గదియనరుదెంచియంచలుకాళ్ళఁబెనఁగ.

గీ.జొనుపుమరుతూవులన వాఁడిచూపులలర
మదికలంగఁగఁ గందువమాట లాడఁ
జూడ్కిమిఱుమిట్లుగొనఁజెంతఁజొరవమెలఁగఁ
గలయఁదిలకించి జడదారికళవళించి.

చ.అటునిటుంఁమోల వేల్పుజవరాండ్రు మెలంగుట లెంచిచూడఁగా
నెటులునుదాను గై కొనిన యిప్పటి పూంకికి నడ్డు వాటుగా
దటుకున నుల్లమం దెఱిగి హాళగలజాలక వారినందఱిన్
దిటమునఁజేరఁజీరి వెనుతియ్యనితియ్యని తేటమాటలన్.

శా ఏలావేయును గొమ్మలార వినుఁడీ యీమీఁదనీతోఁటలో
వాలారుంగనుదోయివిచ్చి మరియేవాల్గంటి నన్ జూచునో
యాలేజవ్వని యప్పుడేయిచటఁజూలాలౌనటం చాడినం
జాలుంజాలునటంచు నాటవలపుల్ పాలించి వారందఱు౯.

క.వచ్చినదారినె పదరే
యిచ్చటఁ తలలెత్తి చూడ కెచ్చటికైన౯
మెచ్చఁగవలదా త్రోవనె,
వచ్చినవనియయ్యె నందుఁబకబకవగుచున్.

క.ఇంతటితో సరిపెట్టెను
గొతతలలు తడవి చూచుకొంటిమి బళిరే
యెంతటినోములు నోఁచితి
మింతిరో మనతొంటిమేననే యని చనుచు౯.