పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/733

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

సీ.వినవయ్య జడదారి వెలయుఁబులస్త్యుండు
మొదటివేలువునకు ముద్దుపట్టి
మచ్చరంబునుగెల్చి మరునకులోఁగాక
యీనను దిగవాడియలరువాఁడు
నిక్కంబుతప్పక యెక్కడుతెలివిని
నీరసంబెఱుఁగక యెసఁగువాఁడు
తొలివేల్పుముక్కంటి వలమురిదాల్పుల
నిచ్చలు మదిలోన నొల్పువాఁడు

వల్లమాలినపూంకితో నిల్లువెడలి,
చలువగొలిపెడు వలిమలకెలన నలరు
చెలువుగులికెడు తృణబిందు నెలవుచేరి,
తపసితన మూనియున్నంతఁదార సిల్లి.

చ.ఆలరులకొమ్మలో మరునియమ్ములొ బంగరు కీలుబొమ్మలో
వలపుదివులో తొవలబావులొ చక్కనిగుజ్జుమావులో
తొలకరిమించులో యనఁగఁ దూకొని యచ్చరలేమలచ్చట౯
బెళుకుఁగమంగవల్ తళుకుఁబెంద్దొడలుం దగ సందడింపుచున్.

సీ.ఒక చోటనునుఁబాట లొకతేటగాఁబాడు
దురు నల్లఱాలెల్ల ఁగరగిపాఱ
నొకయోర వగమీఱ మొకమోరగ నొనర్తు
రలమి దట్టంపువెన్నెలలుగాయ
నొకచాయఁగనుకాయలకు డాయవత్తు రొ
య్యారంపునడకల హవునునిండ
నొకదండవిరిమండ లొడినిండ ఁగూర్తురు
కమ్మనితావులు గ్రమ్ముకొనఁగఁ