పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/723

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

<poem>తృతీయా శ్వాసము 719

నింతవఱకుఁజూడ కేనేమొ యనుకొంటి తెలిసిపోయెను మిదు తెఱఁగు నేఁడు పొడగంటి నేఁడు మా పుడమిలోనెన్నఁడు విని కని యెఱుఁగని వింతలిచట పున్నెమెట్టిదొ యెఱుఁగని ములుచలకును సుగముల నోసంగి యెప్పుడుఁదగవుగలిగి మెలఁగువారికి దొసఁగులు గలుగఁజేయఁ దగ వగునె యించు నోవేల్పు తపసిఱేఁడ. 168

క.అనొ వేలుపు టొడయనిపైఁ, గనలించుకవొడమి యతఁడు కావలసినవా రిని జూపిటకయి తనతో, బనిచినవాని మరలంగఁ బంచె వెనుకకున్. 169

తే.వాఁడు వడి ఁబోయి జముపట్టి పలుకులెల్ల వేల్పు ఱేనికిఁ దిన్నఁ,గా విన్నవించె నపుడ పరువెత్తుకొనివచ్చి యతనిఁగాంచి యచటఁదెఱగంటి పామియిట్లనియెదొరకు. 170

సీ.కొలదిపున్నెముచేసికొన్నవా రదిమున్నుపొందుచుసుగమొందుచుందురించు బదపడి యదిదీఱఁబలువెతల్ ఘుడుతురట్లౌట దుర్యోదమం డట్టులుండెఁ జెడ్డపనులను గొంచెముగాఁగజేసిన వారు తొల్తను వెతపడుదు రిచట గావున సీతమ్మ లీవెత లందరి ముందువీరలు సుక మొందఁగలరు కుంద కేమియు దీవికిడెందమందు !నీవు నొక కాల్ల మాటను నెపమువెట్టి పలికి యొజ్జల నని ఁగోలుపడితి కాన !వలపె నీకుమ నీవారియలఁతఁజూడ.

అ.అనుచుఁదెలియఁజెప్పి యాయనఁగన నీవు మొదల నేటియందు మునుఁగుమనివ మిన్ను వాక లోన ఁగ్రన్ననఁగ్రుంకిడి తనరియతఁ,డు వేల్పుతనము పూనె. 172