పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/724

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శుద్ధాంధ్రభారతసంగ్రహము

తే.అపుడేయా కలియునుడప్పియతనికుడిగి!వింతగానల్క ప్రేముడివిడిచిపొయె

మఱియుఁ గల్గిన తొల్లింటికఱత లెడలి! కలఁకలేనట్టియొకవింత తెలివియొదవె.

క. అంతటఁ దోఁబుట్టువులను! వింతియుఁ దలియునుదండ్రియుయెల్లయనుఁగుల్

చెంతలఁ బొలిచిరి తమతమ! వింతగుగద్దియలమీఁద వేడుకగాఁగన్.

తే. వారిఁగమఁ గొంచు సంతసమారమందు!నెన్నినాళులు నెలచుక్కలెసఁగుమింట
నన్నినాళ్ళును సుగముల నందుచుండు!జముని కొమరుండు వేలుపుజగమునందు.

క. అని పాండుని కొడుకులకత! కొనముట్టఁగ విటు నకుండునుమునుగాఁ
గనుగల జడదారులకును!వినిపించిన పిదప ననియె వెససూతుండూన్.

తే. దీనివ్రసినఁ జదివినఁదెలియయెనిన! వారవెల్లను దగు నడవడినేర్చి
దానిచేతను సిరులనుదద్దఁదసరి! యిందు నందున బెనుసుగ మొందుచుంద్రు.

క.లెక్కకు వెక్కసమగుచును,
బిక్కటిలు జగమ్ము లెల్లఁబెల్లుగ నీలో
నొక్కయెడ న్నెరసులవలె,
నిక్కగొని వెలుంగ నెపుడు నెసఁగెడువేల్పా.
తోదకము. నేలను నింగిన నీటి మెకలన్
మేలిపులుంగుల మీలను వర్సన్.

గద్య. ఇది శ్ర్రీమదప స్తంబసూత్రలొహితసగోత్ర శుద్ధాంధ్ర నిరోష్ట్య నిర్వచన నైషధకావ్యరచనాచాతురీధురంధర సద్య శోబంధుర కందుకూరివంశపయః పారావార రాకాకైరవమిత్ర సుబ్రహ్మణ్యామాత్యపుత్ర సకలసుజనవిధేయ వీరెశలింగ నామధెయ ప్రణీతంబైన యచ్చతెనుఁగు భారతనందుఁ సర్వంబున దృతీయాశ్వసము.