పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/722

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

718 శుద్ధాంధ్రభారతసంగ్రహము


క.నాసై దోడుల బిడ్డల,
వేసాయము చూపవచ్చి బిద్దిన దొరలన్
వాసిం గనుఁగొన నాకిపు ,
డాస పొడమెఁజూపరయ్య నందఱె నిచటన్

చ.అనవుడు మంచిదంచు నపుడాతనిఁదోడ్కోనిపోయి యొక్క చోఁ
బెనుపగు గద్దితన్ సుగము పెల్లుగఁ జెందు సుయె ధనుం దగం
గనుఁగొనుమంచుఁ జూపిరది కనొని యాతఁడు డెందమందుఁదాఁ
గినుకయు నీసునుం బడియేఁగ్రేవను నారదు ఁడుండిచూడఁగన్.
              
ఉ.పుట్టిననాఁటఁగోలె నొకవున్నెముఁజేసి యెఱుంగనట్టి యి
కట్టిఁడి యిందు హాయఁగనఁగా గతమేమొకొ నాకు నారదా
గట్టిగ దెల్పు మం చడిగి గండున మార్కోని పోరిలోపలన్
గీట్టుటయే యనం దనివినిం గనఁడయ్యె సతం డొకింతయన్.
                      
తే. అవలఁదమ్ముల నెయ్యుర నయినవారిఁ
జూప జము పట్టి వేఁడి నఁజూఅడుమంచుఁ
గరము దవ్వుగ ఁగొనిపోయి కాఅనిపించి
రొక్కచోటను నలమట నొందువారి
      
క.అదిగని యేవయుఁగనలుచు,
మదిలోఁబొదలంగఁ జూచి మఱిమఱి పగపుం
గదురఁగఁబొగిలెను దమ్ముల,
కదలని బెడఁదఁ దలచి కలఁతం బడుచున్.
          
సీ.ఇటు కొంతవడిపోక్కి యిట్లనె జముపట్టి
యిదియేమి నారద యింతగోర
మిట్టిదే పరికింప నీవేల్పుజగమున
జరపెడు తగవుల చంద మెల్ల