పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/716

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

712 శుద్ధాంధ్రభారతసంగ్రహము

తే. తాలిమియె తెప్పగా దాని దాఁటి యచట
     చిరుగు లెల్లను నేఱించి సొదలుపేర్చి
     పీనుఁగులరెంటి నందుంచి పెట్టి చిచ్చు
     తిన్నఁగా వారి నిద్దఱ మన్నుసేసె. 135

సీ. చేసి యచ్చట నుండి చెచ్చెర వెల్వడి
                              మరల ద్వారక జేరి మఱుఁగు వెట్ట
  కందఱితోఁగృఘ్ణఁడన్న యు సముయుట
                              చిన్న మొగముతోడఁజెప్పి వైచి
  గుఱ్ఱఁబులను నేనుఁగుల నావులను వెంట
                               నడపించుకొని క్రీడి కడలి గట్టు
 చేరె నంతట నేమని చెప్పువాఁడ
 నప్పు డగంద లొంటిరా వనెడునట్టి
 సమెత నిజంబుగానుప్పు సంద్రమునను,
 మునిఁగిపోయెను ద్వారక మొదలుముట్టి. 136

ఉ.అక్కడి నుండి క్రీడి తగనందఱిఁదోడ్కొని వచ్చు దారిలోఁ
     దెక్కలికాండ్రు బోయ లొగిఁదెన్నున కడ్డమువచ్చి కవ్వడిం
    జిక్కఁగఁజేసి కైరువులు చేకొని వెండియు ఁగూడవచ్చునా
   చక్కెరబోండ్ల సొమ్మూలను జాలఁగదోఁచుకపోయి రొక్కటన్.

ఆ.మగనిచావు క్రీడి మొగమున రుక్మిణి,
      మొదలుగాఁగఁ గలుగు ముద్దరాండ్రు
      సొరది నాకించి సొదపేర్చుకొని చొచ్చి,
      కాలి చచ్చి రొండు క్రచ్చులుడిగి. 138