తృతయాశ్వాసము
సీ.వెన్నునిచే నల్లు మున్ను పంపఁగఁబడి
దారకుఁడరుదెంచి తగినయట్లు
సాండునికొడుకుల దండకుఁజని వారి
కందఱకును జోత లమరఁజేసి
ద్వారకలోఁగృఘ్ణ బలఁగంబు మడియుట
యెల్లను వగచుచు నెఱుకపఱిచి
వెన్నుండు సరగను నిన్ను ఁజూడఁగఁగోరి
నన్నుఁబంచెనని యర్జునునకుఁజెప్పు
నపుడు పయనమై వినచ్చుఁడన్న యొద్ద
సెలవు గైకొని ద్వారక చేరయందుఁ
గృఘ్ణఁగానక వందురి కీడుమిఁది
కీడుగా వసుదేవుడు కెడయఁజూచి
యతనికిని నగ్గికర్జంబు లపుడ తీర్చి. 131
క.అడవులఁబడి కవ్వడి వడి,
నడులుచుఁ జెలికానికొఱకు నందును నిందున్
దడఁబడ నడుగులు దడవుచుఁ,
బొడగ నెఁబీనుంగు జెట్టు మొదలనునొకచోన్. 132
తే. అట్లు కని మొదల్నఱికిన యరఁటివోలె,
నేలఁబడి గోలుగోలునఁజాల నేడ్చి
తన్ను దఱివార లూరార్పఁదాల్మిపూని,
కడకుఁబీనుంగుపైఁబడి కౌఁగిలించి. 133
తే. లేచివెనుకటినెయ్యముల్చెప్పికొనుచు
నడుగులొకకొన్ని వారితోనడచిమెలఁ
గాంచి బలరాము పీనుంగుఁ గదిసి దాని
వగపు సంద్రంబులోపల మిగులమునిఁగి. 134
పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/715
Appearance
ఈ పుట ఆమోదించబడ్డది