Jump to content

పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/717

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

                             తృతీయాశ్వాసము 718

తే.సత్య మొదలైన తక్కినచాన లెల్ల
     గోరికలఁగోసి యడవి యాకులను మేసి
     యిచటి సుగమున నెడఁబాసియెసఁగఁదలఁచి
    యపుడ యడవులపాలైరి యడలుతోడ. 139

క.తక్కిన వారలఁదోడ్కొని,
మిక్కిలి వెసనంబుతోడ మే నదరంగా
నెక్కుడు పయనంబుల ఁదన,
యిక్కకు నరుదెంచి చేరె నెల్లరతోడన్. 140

క.అచ్చటికి వ్యాసుఁడప్పుడు,
వచ్చినఁగనలేక మొగము వంచుకొనుచు వి
వ్వచ్చు ఁడు పలుకం జాలక,
వెచ్చున నూర్చుచును జెమట వెల్లువగట్టన్. 141

తే.కాళ్ళపయి వ్రాలి యేడ్చుచుఁగదలకున్న,
లేవఁగానెత్తి మదిలోన ఁజేవవూన
నూఱుతెఱఁగులనాతల నూఱడించి,
యిప్పగిదిఁగుందఁగతమే మొచెప్పమనియె 142

మ.అనినం గాన్నుల నీరునించుచును నేయంబొప్ప నన్నేప్పుడుం
దనయట్లే కనుఁగొంచుఁబోర ననుఁబెద్దంజేసి తామావులం
జనిగాఁదోలుటకైన నోప్పుకోని నక్ సై దోడుకన్నం గడు ం
బనిగాఁబ్రోచిన కృఘ్ణఁడిప్ణు మడిసెం బల్కుల్ మఱింకేటికిన్. 143

క.బలరాముండును దక్కుం,
     గల వెన్ను నివంక వారుఁగడతేఱిరి మొ
    క్కలముగ నొండొరువులతోఁ,
    జలమునఁబోరాడి కల్లు చవిగొని యుంటక్. 144