పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/706

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
శుద్ధాంధ్ర భారతసంగ్రాహము
సంతసంబు మీఱ జనుదెంచెఁ గ్రీడియు,
నూరునేరఁ జాల నొడమిఁ గొనుచు.

ఉ. తమ్ముని రాకకు మదిని దద్దయు నెంతస మంది యక్కునన్

నెమ్మిని గారవించి తగునేమముతోడను మావుజన్నమున్
నెమ్మది జేయగా దివితి నేలను గల్గిన జన్ని గట్లకున్
సొమ్మును గొల్లగా నొసగి చొచ్చి యుధిష్టురుడల్లజన్నయున్.

క. ఎల్లరుమెచ్చగ నొనరిచి, యుల్లము తల్లడము దీఱి యొజ్జల నీవిం

బెల్లగు మన్ననల దనిపి, యెల్లర ఁ దగవీడుకొల్పి యెలమింబొంచెన్.

తే. రహిని గాంధారికిని ధృతరాష్ట్రునకును,

బనులు సేయుచువారలబ్రాతి బడసి
కావులెల్లను దన్నెప్డు గన్నతండ్రి,
వడువుననుజూడజముపట్టి పుడామినలె.

సీ. తెల్లవారదడవ యల్లనఁ బాండుకొ

మారులు సేమంబులారయంగఁ
గొంతియు గోడండ్రుఁ గూమితోవచ్చి
పలుమాఱు నిచ్చలుఁ బనులు సేయఁ
గొలువుడు కాండ్రెల్ల నలసట యెఱుగక
కెలనగాచుక యుండికొలువుసేయ
నారగించినవెంక నరుదెంచి పాఱులు
కదలక వేడుకకతలు సెప్పఁ
గొడుకు లెల్లను బోయినకొఱత యించు
కేనికానరాకుండంగనెసగుచుండె
దానుధృతరాష్ట్రుడు డల్ల గాంధారిగూడి,
జముని కొమరుండు తగ్గినట్లు జరువుకతన.