పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/705

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
తృతీయా శ్వాసము
వేలుపులు మెచ్చఁ బోరాడి వెనుకగ్రీడి
బభ్రువాహనుతూపున బడియెనేల
నంతఁ జిత్రాంగదయువచ్చి యడల దొడఁగెఁ
గొడుకుదూఱుచు మగనిపై ఁబడి కడంగి.

తే. క్రన్నననులూచి పాపజగమ్మునుండి,

మందుగొనివచ్చియిచ్చిన నందముగను
లేచికూర్చుండె గవ్వ్డిచూచి యెల్ల
వారుమరలఁ జచ్చినవాడు బ్రతికెనంచు.

ఆ. తలచి సంతసిలిరి తర్వాత గొడుకును ! దండ్రి కాళ్ళ వ్రాలితడవునిలిచి

తప్పుసైపవేడ దటుకున నక్కున ! గదియు జేర్చి పట్టి గౌరవించె.

చ. అటుపిదపం గొమార నల రాగంగ వీడ్కొని యొండుచోడికిం

దటుకున బోయి కానలను దత్తడితోడను జొచ్చి యేఱులన్
దిటమున దాటి యెండకునుదెమ్మకు నోర్చుచు గ్రీడి కొన్ని నా
ళ్ళటునిటు నూరకే తిరుగులాడుచు గుఱ్ఱమువెంట బిమ్మటన్.

క. చొచ్చి జరాసంధునిప్రో,

లచ్చత నాతని మనుమని నాలములో ని
వ్వచ్చుడు లోగొని కానుక,
లచ్చువడం బుచ్చుకొనియె నాతనివలనన్ .

తే. పిదప గాంధార మనునేల బేర్మితోడుం ,

గ్రీడి జన్మ పుగుఱ్ఱబుతోడఁ జొచ్చి
గోర మగుపోర నచ్చటివారి నోర్చి,
వారికడసొమ్ముఁగొని వెనకవంకమరలె.

ఆ. అంతఁ గ్రీడి రాక నటమున్నె వన్నుండు,

జమునుపట్టితోడ నమరఁదెల్సె