పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/707

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
తృతీయా శ్వాసము

క. బీదకు పాదకు బాపల, కాదటఁ దామిచ్చుచుండు రముదుపళ్ళున్

గాదనక కానునీసము, ప్రోదిగఁ గొడుకియ్య బండువులఁ బబ్బములన్.

సీ. ఇఆమాడ్కిఁ గొన్నియేం డ్లేమిటను గొఱంత

లేకుండ నచట మేలిమగనుండి
యొకనాడు ధృతరాష్ట్రుడొంటిగ వచ్చిన
జముపట్టి నొద్దకు జక్కబిలిచి
యెవ్వరు వినకుండ నేకతంబున జెప్పె
నాతండ్రి నీవుల్లు నడుపుచుండఁ
గొడుకులు గలనాటి వడూవునకంటెను
జాల మేలుగ బ్రొద్దు జరుగునాకు
నిచటి సుగముననెల్ల ను నిచ్చతీఱం ,
గుడిచినాడను నేండ్లును గడేచె జాల
నింక బెఱజగమ్మను గోరిటితపు నాకు,
నడవికినిబోయి యుండగ నానతిమ్ము.

తే. అనిసగుండేలు బ్రద్దలై యతడు కొంత

వడివితాకున బెదవులు డడ్వుకొనుచుఁ
బలుకగా లేకయెట్ట కేనెలుగు తెచ్చు,
కొనియుధిష్టిరు డలతండ్రికనియెనిట్లు.

క. మీరడవులకుం జనగా,

నేరను నేనుండ నిచట నేనునుమీతో
గారవమున వచ్చెద నిదె
యీరలు నను గూడ గొంచు నేగుడు వెంటన్

క. పోవలదని పలుదెఱగులు, గా విన్నపమును నొనర్చి కాళులమీదన్

లేవక పడగావ్యాసుడు, తా వచ్చి యుధిష్టిరుఁ గని తగనిట్లనియెన్.