పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/701

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయా శ్వాసము

తరల. అచటివారలచేత గారవమంది యాజడదారులున్
ముచటదీఱఁగ నందు వెన్నుని మోడ్పుఁగన్నులఁ జూచి వేఁ
డుచును దద్దయుఁ బ్రొద్దుపుచ్చి కడుం గడుం జముపట్టితో
నెచటనుం గనరాని నాయములెల్లఁ జెప్పిరి కూరిమిన్.

తే. పిదప భీష్ముండుమనుమని వెరవుమీఱఁ,
      బున్నెములజాడలను దెల్పిబుజ్జగించి
      ప్రోలికంచెను వ్యాలుపంపునను నంత,
      నుండి పదియేను నాళ్లతఁ డూరనుండి.

ఉ. ఆవలఁ దోడఁబుట్టువులు నందలిపెద్దలు నూరిపాఱులున్
       బావయుఁ జుట్ట్టముల్ గొలుచువారలునుం బెదతండ్రితల్లియుం
       బ్రోవులుగట్టి వెంబడిని బోరనరాఁగ యుధిష్ఠిరుండు న
       త్తావున కేగుదెంచెఁ దనతాతను గ్రమ్మఱఁ జూచువేడుకన్.

క. ఏతెంచి జోతచేయుడు
      నాతండును మోడ్చుఁగన్ను లరతెఱచి వడిం
       జేతుల నిమురుచు మనుమని
        నాతఱి దీవించి యిట్టులనె ధృతరాష్ట్రున్.

క. కొడుకులపోకకు మది వగ
      గుడువకు మించుకయు నీదు కొదవల నెల్లం
      గడువడి నుడుపు యుధిష్ఠిరుఁ
       డడలక యీతనినె నమ్ముమన్నిటికింకన్

ఆ. అనుచుఁ జెప్పి పిదప నందఱి సేమంబు,
        లరసి కనులు మొగిచి యబ్బురముగ
         మొదలుఁదుదియులేని మొనవేల్పుమదినిల్పి,
          విన్ను వాఁకకొడుకువిడిచెనునుఱు.