పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/702

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శుద్ధాంధ్రభారతసంగ్రహము

ఆ. కొంతసేపు తాత కొఱకును జముపట్టి, కనుల నీరుసించి కళవళించి
వెనుకఁ బెద్దవారి పనుపున నతనికి, నగ్గిపనులు దీర్చెనడలుతోడ.

మ. వెనుకన్ భీమునియన్న తాతకును దానిన్నేటిలో నూవులన్
వనటఁబొందుచు నీళ్లతో వదలియానాఁడేటినిం దాఁటి త్రో
వను నన్నం దనతాతఁ జంపుటకుఁగా వంతం గడుం బొంది కా
ననునుండం జనువాఁడనంచుఁబలుకన్ వ్యాలుండనుం గృష్ణుఁడున్.

తే. పలుదెఱంగులఁ దాల్మిమాటలనుగఱపి,
యింటికియుధిష్ఠిరుని దెచ్చి రెట్ట కేల
కంతవ్యాసుండు జముపట్టి ననువుమీఱ,
వారువపుజన్న మొనరింప నేఱుపఱిచె.

క. పోరున దాయల నటువలె, దోరించిన దోసమెల్లఁ దొలఁగును నీకున్
వారువవు బన్నమున నని, ప్రేరేప యుధిష్ఠిరుండు వెతదిగఁ ద్రావెన్

వనమయూరము. కవ్వడిని గుఱ్ఱమును గావఁగను బంచెన్
నెవ్వడిని జన్నమును నివ్వటిలఁ జేయున్
నవ్వుచును వెన్నువిని వగతాలిమిని దాల్చెన్.

మత్తకోకిల. అన్నపంపునఁ క్రీడి విల్లును నమ్ములుం దనరారఁగన్
దిన్నఁగా నల మావువోయిన తెన్నునం జనుచుండఁగా
మున్నుగా నరుదెంచి జక్కివి మోఁది పట్టు త్రిగ ర్తలం
జిన్నపోరున గెల్చి చెచ్చెరఁ జేరె నొండు విలాతికిన్.

శా. అంతం దత్తడి పోయిపోయి గరువం బారువం బారంగఁ బ్రాగ్జ్యోతిషం
బెంతో నైళమ చేరెఁ జేరుటయు నప్డే వజ్రదంతుండు దా
నంతోసంబున వచ్చి పట్టుకొనియెం జక్కిం జలం బొప్పఁగాఁ
బొంతం గవ్వడి వచ్చి తాఁకెనతనిం బోటొగ్గి వాల్దూపులన్.